ఢిల్లీలో పొర్లుదండాలు, హైదరాబాద్ లో ప్రగల్భాలు: కేసీఆర్ పై సంజయ్ ఫైర్

ఢిల్లీలో పొర్లుదండాలు, హైదరాబాద్ లో ప్రగల్భాలు: కేసీఆర్ పై సంజయ్ ఫైర్

ఢిల్లీలో పొర్లుదండాలు, హైదరాబాద్ లో కేంద్రం మెడలు వంచుతానని అనడం సీఎం కేసీఆర్ కే చెల్లిందని అన్నారు బీజేపీ నాయకులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ.. కేసీఆర్ చేసే ప్రచారం అంతా వట్టిదేనని చెప్పారు. తొందరలోనే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు బయటపెడతానని తెలిపారు. అయితే ప్రధాని మోడీపై, కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని… వారికి కేసీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రమూలాలు ఎక్కడ ఉన్నా అంతం చేస్తామని మాత్రమే కిషన్ రెడ్డి అన్నారని సంజయ్ తెలిపారు. ప్రధానిని కించపరిచేలా మాట్లాడటం ఒక సీఎం స్థాయి వ్యక్తికి గౌరవం కాదని ఆయన అన్నారు.