బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు వణుకుతున్నారు

బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు వణుకుతున్నారు

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తారను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఈ రోజు (22.7.2022) హైదరాబాదులో ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టిఆర్ఎస్ మూకలు బరితెగించి దాడికి పాల్పడటం హేయనీయం అని వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారని తెలిపారు.

ప్రజా గోస - బీజేపీ భరోసా పేరుతో బీజేపీ నేతలు బైక్ ర్యాలీలతో గ్రామాల్లోకి వెళుతున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేస్తున్న బీజేపీ శ్రేణులను ప్రజలు ఆదరిస్తుండటంతో టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులపై దాడులు చేస్తూ గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకుంటెంటే చర్యలు తీసుకోవలసిన పోలీసులు టీఆర్ఎస్ నేతలకు కొమ్ము కాస్తూ బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు ఆరోపించారు. వెంటనే అరెస్టయిన బీజేపీ నేతలను విడుదల చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.