వ్యాక్సిన్ కమీషన్ వస్తలేదని కేసీఆర్ బాధలో ఉన్నడు

వ్యాక్సిన్ కమీషన్ వస్తలేదని కేసీఆర్ బాధలో ఉన్నడు

మోడీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటనను మెచ్చుకొని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలు మెచ్చుకుంటుంటే.. సంస్కారం లేని కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. 

‘కేసీఆర్ యాడ పన్నాడో కూడా తెలియదు. 2500 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ వేస్తామని కేసీఆర్ ప్రకటించాడు. ప్రధాన మంత్రి మోడీ అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించడంతో మరి 2500 కోట్లు ఎటు పోయినయి? జూన్ 21 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్రంలో సిబ్బంది కొరత ఉంది. వసతులు కూడా లేవు. 500 కోట్లతో  రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌తో పాటు ఆసుపత్రుల్లో సేవల కోసం పర్మినెంట్ సిబ్బందిని కూడా నియమించాలి. మోడీ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామంటే సంతోష పడాల్సింది పోయి కేసీఆర్‌కు బాగా బాధ అవుతుంది. 2500 కోట్లలో తనకు కమీషన్ రాకుండా పోయిందని బాధపడుతున్నాడు. తన కుటుంబానికి ఏమీ మిగలడం లేదనే బాధలో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు’ అని ఆయన అన్నారు.