హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ గేమ్ చేంజరేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ గా ఉండి రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గద్దె దింపింది రేవంత్ కాదా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి బండి సంజయ్ చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేశారన్నారు.
ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా కేవలం ఒక్క కేరళలో మాత్రమే ప్రచారం చేసి, అక్కడ యూడీఎఫ్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని, అది గేమ్ చేంజర్ అని తెలిపారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ .. రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.
