విభజన హామీలపై పార్లమెంట్​లోమాట్లాడాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి

విభజన హామీలపై పార్లమెంట్​లోమాట్లాడాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి
  • బీజేపీ ఎంపీలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి    డిమాండ్​

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ తెలంగాణపై వివక్ష చూపకుండా గుజరాత్ మాదిరిగా అభివృద్ధి చేయాలని కోరామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు కలిసినపుడు పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల గురించి వారి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేయడం తప్ప.. రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పటం లేదని అన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్, నేషనల్ డిజైన్ సెంటర్ కు సంబంధించి, స్మార్ట్ సిటీస్ వరంగల్, కరీంనగర్ లకు సంబంధించి ఈ నెల 22 నుంచి జరగబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో బీజేపీ ఎంపీలు మాట్లాడాలని ఆయన కోరారు.

వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 2019 నుంచి 2024 వరకు సుమారుగా రూ.2,025 కోట్లు, ఇరిగేషన్ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని చామల గుర్తు చేశారు.