హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో రేవంత్ సర్కార్ చేసే మంచి పనులను అడ్డుకోవడమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు లక్ష్యంగా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలుస్తుందనే దుర్భుద్దితో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రెండున్నరేళ్లలో రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వేలేక బీజేపీ నేతలు హైదరాబాద్ ప్రగతిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా మారారని ధ్వజమెత్తారు.
