
- ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామాన్ని వీర బైరన్పల్లిగా మార్చాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఎంపీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బైరాన్‌పల్లిలో రజాకార్ల దాడిలో అమరులైన వారికి నివాళులర్పించి స్తూపం, బురుజు అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బైరాన్‌పల్లి గ్రామాన్ని వీర బైరాన్‌పల్లి గ్రామంగా పేరు మార్చాలని కోరారన్నారు. దీంతో 1947 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో జరిగిన విషాద ఘటనను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి ఊరు పేరు మార్చాలని విన్నవించినట్లు చెప్పారు.