
- ఎంపీ చామల కిరణ్ ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: ప్రజలు తనకు ఓట్లు వేయకపోతే పాడె ఎక్కుతానని ఓట్లర్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భయపెట్టారని, ఆయన ప్రవర్తన చూస్తే మీడియా అటెన్షన్ డీసిస్ ఉన్న వ్యక్తిగా అర్థం అవుతున్నదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము బీజేపీకి ఓటు వేశామని రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలు తనకు చెప్పారని పాడి చేసిన ఆరోపణలపై చామల ఫైర్ అయ్యారు. అదే నిజమైతే ఆ ముగ్గురు ఎంపీల పేర్లను చెప్పాలని చామల డిమాండ్ చేశారు.