కల్వకుంట్ల కుటుంబం లిక్కర్ మాఫియాతో చేతులు కలిపింది

కల్వకుంట్ల కుటుంబం లిక్కర్ మాఫియాతో చేతులు కలిపింది

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. దీని వెనక సీఎం కేసీఆర్ హస్తం ఉందన్నారు. కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతుందని త్వరలో నిజాలు బయటపడతాయన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి ప్రజా సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణను దోచుకున్నది చాలదన్నట్టు దేశాన్ని దోచుకునేందుకు కవిత బయల్దేరిందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ప్రజల్లో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ ప్రస్టేషన్ లోకి పోయారని.. అందుకే బండి సంజయ్ ను అరెస్ట్ చేసి..ప్రజా సంగ్రామ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు.  లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి ప్రైవేట్ జెట్ ఫ్లైట్, ఒబెరాయ్ హోటల్ కు కవిత ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. దేశంలో జరుగుతున్న అవినీతి కేసుల్లో కేసీఆర్ హస్తం ఉంటుందన్నారు. లిక్కర్ దందాను అడ్డుపెట్టుకుని పంజాబ్ కి వెళ్లి రైతులకు పరిహారం ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.