సీఎం కనబడటం లేదు.. ఎక్కడ ఉన్నారు : ఎంపీ అర్వింద్ 

సీఎం కనబడటం లేదు.. ఎక్కడ ఉన్నారు : ఎంపీ అర్వింద్ 

పసుపు బోర్డు ఏర్పాటుతో పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. గత ఎన్నికల్లో పసుపు రైతులు తనకు ఓట్లు వేయలేదని, వారికి వారే వేసుకున్నారని, ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుండడంతో ఈసారి జరిగే ఎలక్షన్స్ లో తమకే ఓట్లు వేస్తారని చెప్పారు.

గతేడాది 1600 కోట్ల రూపాయల పసుపు ఎగుమతి జరిగిందని, ఈ ఏడాది 8 వేల 400 కోట్ల రూపాయలకు పెంచాలనే టార్గెట్ ప్రధాని మోదీ ఇచ్చారని చెప్పారు. 15 రోజుల నుంచి ముఖ్యమంత్రి గురించి ఎవరికీ తెలియడం లేదన్నారు. సీఎం కేసీఆర్ కనబడటం లేదు.. ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ హెల్త్ బులిటెన్ వచ్చిందా..? అని ప్రశ్నించారు. 

నిన్న (అక్టోబర్ 3న) సిద్దిపేట రైల్వేస్టేషన్ లో ప్రష్టేషన్ తో హరీష్ రావు మాట్లాడారంటూ మండిపడ్డారు. ఎవరైనా గవర్నమెంట్ కార్యక్రమానికి పార్టీ జెండాలు పట్టుకుని వస్తారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు రిజక్ట్ చేయాలన్నారు. 

ఎమ్మెల్సీ కవితకు ఇప్పటికే 10 నోటీసులు వచ్చాయని, మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియదన్నారు. రేవంత్ రెడ్డిపై మీకు ఎందకంత ప్రేమ అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు వెళ్లడం లేదని, రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు సీటు ఇచ్చినట్టే అన్నారు. 

ALSO READ : ఇది ఫైనల్ : తెలంగాణ ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది

కేసీఆర్ ఇంట్లో కూర్చుని జనాలను కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆరే డబ్బు సమకూర్చుతారని చెప్పారు. మళ్లీ గెలిచిన వాళ్లు బీఆర్ఎస్ లోకి వస్తారన్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ ఇవ్వలేదన్నారు. జాతీయ హోదా కావాలని ఇష్టం లేకనే... కేంద్రంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీ మునుగుతోందన్నారు ఎంపీ అర్వింద్. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల దశాబ్దాల కల నెరవేర్చామన్నారు.