నిజామాబాద్ జిల్లా ఎక్స్ పోర్ట్ హబ్ గా మారాలె

నిజామాబాద్ జిల్లా ఎక్స్ పోర్ట్ హబ్ గా మారాలె

రైతుల వద్దకే వెళ్లి కొనేలా ప్లాన్ రెడీచేయండి
స్పైస్ బోర్డు, హార్టికల్చర్ ఆఫీసర్లతో ఎంపీ అర్వింద్

నిజామాబాద్ టౌన్, వెలుగు: దేశంలో నంబర్ వన్ ఎక్స్ పోర్టర్లందరూ నేరుగా రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేసేలా స్పైస్ బోర్డు, హార్టీకల్చర్ ఆఫీసర్లు ప్లాన్ రెడీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. నగరంలో రీజినల్ కం ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటు తర్వాత జరిగిన ప్రగతిపై బుధవారం జూమ్ యాప్ ద్వారా స్పైస్ బోర్డు, హార్టికల్చర్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆఫీసర్లు రెడీ చేసిన ప్లాన్ తో నిజామాబాద్ ఎక్స్ పోర్ట్ హబ్ గా మారాలన్నారు. ఎక్స్ పోర్టర్లను ఆకర్షించేలా కోల్డ్ స్టోరేజ్ లు, వేర్ హౌజ్ల నిర్మాణాలను చేపట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్లాన్ చేయాలన్నారు. జిల్లా రీజనల్ కం ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటైన నాలుగైదు నెలల్లోనే పసుపు విదేశాలకు ఎక్స్ పోర్ట్ చేయడ సంతోషకరమైన విషయమన్నారు. ఇందుకు కారణమైన ఆఫీసర్లను ప్రశంసించారు. కరోనా కారణంగా నెమ్మదిగా నడుస్తున్నఈ ప్రక్రియను స్పీడప్ చేయాలని సూచించారు. కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండేలా తీసుకొనే చర్యల్లో భాగంగా అందుకు అవసరమయ్యే ల్యాబొరేటరీ, ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించాలని, వచ్చేరెండేళ్లలో 25,000 టార్పాలిన్ షీట్లు అందించేలా ప్లాన్ రెడీ చేసి తనకు నివేదించాలని ఎంపీ సూచించారు. ఇందుకు కావాల్సిన ఫండ్స్ విషయంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని, సెంట్రల్ డిపార్ట్ మెంట్లతో తాను మాట్లాడుతున్నానని తెలిపారు. జిల్లాలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటు కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారికి పర్మిషన్ ఇవ్వాలని హార్టీకల్చర్ ఆఫీసర్లను కోరారు.

ఈ సందర్భంగా హార్టీకల్చర్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పసుపు సాగు తగ్గిందని అన్నారు. గతంలో 1.33 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే ఈ సారి 75 వేల ఎకరాల్లో మాత్రమే పసుపు సాగు చేశారని తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్, ల్యాబొరేటరీ నిర్మాణానికి వేల్పూర్ మండలం పడగల్ శివారులో 40 ఎకరాల స్థలం ఉందని తెలిపారు. ఆ స్థలంలో నిర్మిస్తే నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. టైస్ స్కీం ఏర్పాటుతో పాటు ఆయా అంశాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. రివ్యూలో స్పైస్ బోర్డు డీడీలు వెంకటేశన్, లింగప్ప, హార్టీకల్చర్ డీడీ నర్సింగ్ దాస్ పాల్గొన్నారు.

For More News..

తెలంగాణలో మరో 1931 కరోనా కేసులు

ఆర్టీపీసీఆర్ టెస్టులకు క్యూ కడుతున్న జనాలు