నారాయణపేట, వెలుగు : నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో ఎండోస్కోపిక్ అధునాతన పరికరాల ప్రారంభంతో ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం జిల్లా ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే దివంగత చిట్టెం నర్సిరెడ్డి జ్ఞాపకార్థం అంబియన్స్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ. 10 లక్షల విలువైన అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స పరికరాలను బహుకరించగా, వాటిని ఎంపీ ప్రారంభించారు.
