అమిత్ షాతో డీకే అరుణ భేటీ ...రాష్ట్ర తాజా రాజకీయాలపై చర్చ

అమిత్ షాతో డీకే అరుణ భేటీ ...రాష్ట్ర తాజా రాజకీయాలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సమావేశం అయ్యారు. సోమవారం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో అమిత్‌‌‌‌‌‌‌‌ షాను ఆయన ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకం తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తెలంగాణలో బీజేపీ కమిటీల నియామకం, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం.