పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు: రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధితోపాటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనకు రామగుండం ఎన్టీపీసీ వద్ద కాంగ్రెస్ లీడర్లు ఘన స్వాగతం పలికారు. ఐఎన్​టీయూసీ నేషనల్ సీనియర్​ సెక్రటరీ, ఎన్​బీసీ మెంబర్​బాబర్​సలీంపాషా శాలువాతో సత్కరించారు.

 ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లీడర్లు జావెద్, మల్లేశ్​యాదవ్ తదితరులు పాల్గొన్నారు.