హైదరాబాద్ లో అనేక తీవ్ర వాద సంఘటనలు జరిగాయి

హైదరాబాద్ లో అనేక తీవ్ర వాద సంఘటనలు జరిగాయి

తీవ్రవాద వ్యతిరేక  బిల్లును ఎందుకు అడ్డుకున్నారో టీఆర్ఎస్ ఎంపీలు చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు డిమాండ్​చేశారు. గతంలో తెలంగాణలో టెర్రరిజం లింక్ లు బయటపడ్డాయన్నారు. తీవ్ర వాదానికి సంబంధించిన ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రిక్షన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. రాజకీయం చేయడం కోసం చౌకబారు ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. టెర్రరిజం అంశం అన్ని పార్టీలకు ప్రధానమైనది. గతంలో హైదరాబాద్ వేదికగా అనేక తీవ్ర వాద సంఘటనలు జరిగాయని తెలిపారు.

ఇండియన్ ముజాహిద్ధీన్, తీవ్ర వాద సంస్థలకు చెందిన నేతలు తెలంగాణలో పట్టుబడ్డారని జీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యానించారు. జూన్ 29 న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ కు అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో తెలంగాణ తరపున రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జీఎస్టీ రేట్ల పెంపు  నిర్ణయాన్ని వ్యతిరేకించారా? అని జీవీఎల్ నర్సింహారావు ప్రశ్నించారు.