
- 1000 గజాల స్థలంలో అతిథి గృహం నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామిని సోమవారం ఎంపీ కె. లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదం, శేష వస్త్రాలు అందజేసి సన్మానించారు.
ఈవో అన్నపూర్ణ మల్లికార్జునస్వామి క్షేత్రాన్ని ప్రసాద స్కీంలో చేర్చాలని వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన లక్ష్మణ్ తన ఎంపీ నిధుల ద్వారా 1000 గజాల స్థలంలో అతిథి గృహం నిర్మించేందుకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఎస్టిమేట్ తయారుచేసి పంపించాలన్నారు.