కాశీబుగ్గ, వెలుగు: మహిళల భద్రతపై వ్యవస్థల పనితీరు ఎలా ఉందో తెలపాలని లోక్సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. సోమవారం ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ బేటీ బచావో – బేటీ పడావో అంటూ ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బాలికల భద్రత విషయంలో ఏం చేస్తుందని ప్రశ్నించారు. దళిత మహిళా స్కాలర్పై జరిగిన ఘటనపై కేంద్రం స్పందించాలని, మహిళా విద్యార్థుల భద్రతకు బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

