
హైదరాబాద్, వెలుగు: మోడీ పిలుపు మేరకు సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో విస్తృతంగా పర్యటించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 31న సర్దార్ పటేల్ జయంతి వరకు 150 కిలో మీటర్ల పాదయాత్రకు ప్లాన్ చేయాలన్నారు. బీజేపీ హైదరాబాద్ ఆఫీస్‌లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తలతో కిషన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.