డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలకు కర్ణాటక వేదిక కాబోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్ గా బాగా  పాపులర్ అయ్యారు. డీకే శివకుమార్  పై కాంగ్రెస్ హైకమాండ్ కు  కూడా నమ్మకం పెరిగింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల్లో కూడా డీకే కల్గజేసుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలపై కూడా డీకేతోనే చర్చలు జరుపుతున్నారు రాష్ట్ర నేతలు.

 ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కర్ణాటక వెళ్లి డీకేతో భేటీ అయ్యారు. లేటెస్ట్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరికలపై చర్చించారని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో  పార్టీలో చేరికలు, రానున్న ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహాలపై  డీకేనే నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.