రైతులు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు

రైతులు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ను రూపొందించలేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇది కేవలం ఎన్నికల బడ్జెట్ మాత్రమే అని ఆరోపించారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్నికొనుగోలు చేయకపోవడంతో క్వింటా 1200 నుంచి 1300 రూపాయాలకే అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర రాక..చేసిన అప్పులు తీర్చలేక వరి ధాన్యం కుప్పల మీదనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకొచ్చిన ధరణితో భూ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందన్నారు. నోటిఫికేషన్లు లేవు..కనీసం నిరుద్యోగ  భృతి ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫ్రంట్లు, టెంట్లు అంటూ దేశం మొత్తం తిరుగుతూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని..ఉచిత ఎరువుల హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు ను కట్టారని..గంధమల్ల ప్రాజెక్ట్ ను ఎందుకు రద్దు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

మరిన్ని వార్తల కోసం

మార్చి లోగా రూ.50 వేల రైతు రుణాలు మాఫీ

కొత్త మెడికల్ కాలేజీలకు రూ. 1000 కోట్లు