నల్గొండలో పథకం ప్రకారమే కోమటిరెడ్డి దూకుడు

నల్గొండలో పథకం ప్రకారమే కోమటిరెడ్డి దూకుడు
  • నియోజకవర్గం నుంచి పోటీచేస్తానన్న ఎంపీ
  • సర్వేల తర్వాత ఎమ్మెల్యే లక్ష్యంగా మాటల తూటాలు
  • సీఎం రాక పై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే
  • ఆయన ద్వారా కౌంటర్ ఇప్పిద్దామనే ఆలోచన

నల్గొండ, వెలుగు : ల్గొండ లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూకుడు వెనుక పక్కా వ్యూహం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ప్రకటించినప్పటి నుంచి వెంకట్​రెడ్డి ఒక పథకం ప్రకారం నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల నల్గొండలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుపై ఆరోపణలు చేసిన వెంకట్​రెడ్డి తాజాగా జిల్లాలో నడుస్తున్న ఇసుక, ల్యాండ్ మాఫియా, గంజాయి అక్రమ రవాణాను ప్రస్తావిస్తూ అటు పోలీసులపై, ఇటు ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు.  'సాండ్​, ల్యాండ్​ మాఫియాతో నియోజకవర్గంలో గ్రామాలు  ఆగం అయితున్నయ్.. నల్గొండ పట్టణంలో ఏ కిరాణ షాపు వెతికినా గంజాయి ప్యాకెట్లే దొరుకుతున్నయ్.​.  పోలీసులు ఇల్లీగల్ దందాకు కొమ్ముకాస్తుంటే, లోకల్​ ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి భారీ పోలీస్​ బందోబస్తుతో దర్జాగా తిరుగుతున్నరు..’ అంటూ మండిపడ్డారు. 

సర్వే రిపోర్టులు అనుకూలంగా లేవని.. 

పీకే టీం, ఇంటిలిజెన్స్​ నివేదిక ఆధారంగా నల్గొండ నియోజకవర్గంలో రూలింగ్​ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగిందని కాంగ్రెస్​ పార్టీ లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గతంలో 76 శాతం ఉన్న వ్యతిరేకత ఇప్పుడు 82 శాతా నికి చేరిందని, ఇది తమకు అనుకూలంగా మారుతుందని కోమటిరెడ్డి వర్గీయులు చెప్పుకుంటున్నారు. కానీ నల్గొండలో జరుగుతున్న అభివృద్ధి తమకు వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందన్న నమ్మకంతో ఎమ్మెల్యే ఉన్నారు. కానీ సర్వే రిపోర్ట్​లు వ్యతిరేకంగా ఉండడం, కోమటిరెడ్డి దూకుడుకు కారణంగా తెలుస్తోంది.  దీన్ని తిప్పి కొట్టేందుకు ఎమ్మెల్యే సీఎం టూర్​ పైనే ఆశలు పెట్టు కున్నారు. మెడికల్​ కాలేజీ శంకుస్థాపనకు మంత్రి హారీశ్​రావు రావాల్సి ఉన్నా కాదని కేసీఆర్​ రాక కోసం పట్టుబట్టారు. ఈ నెలా ఖరులో సీఎం టూర్​ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనికోసం భారీ బహిరంగ సభ కు ప్లాన్​ చేస్తున్నారు. ఈ సభా వేదికగా ప్రతిపక్ష లీడర్ల కు గట్టి కౌంటర్​ ఇవ్వాలనే ఆలోచనతో ఎమ్మెల్యే ఉన్నారు.  కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం టూర్​ పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఒకవేళ సీఎం వచ్చినా కేవలం మెడికల్​ కాలేజీ ఫౌండేషన్ వరకే పరిమితం కావచ్చని అధికారులు చెప్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా 
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న వార్​ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.