కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది : లక్ష్మణ్

కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది : లక్ష్మణ్

ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అరోపించారు. 1993 నుంచి ఢిల్లీలో ఉంటేనే బీసీ సర్టిఫికెట్ ఇస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం షరతులు విధించడం సరికాదన్నారు. ఢిల్లీలో కోటి యాభై లక్షల మంది బీసీ కులాల వారు ఉన్నారని చెప్పిన లక్ష్మణ్...బీసీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల పాఠశాలల్లో, ఉద్యోగాలలో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ బీసీ విద్యార్థుల కోసం మెడికల్, పీజీ కాలేజీలో రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. కానీ దీనిపై ఢిల్లీ ప్రభుత్వం రిప్లై ఇవ్వకపోవడంతో బీసీ విద్యార్థులు రిజర్వేషన్ పొందే అవకాశం లేదన్నారు.  తొమ్మిదేళ్లుగా  కేజ్రవాల్ ప్రభుత్వం బీసీ సర్టిఫికేట్ అంశం గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు.