
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బిష్ణు పడరాయ్ తరుఫున అండమాన్ నికోబార్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బుధవారం ప్రచారం నిర్వహించారు.
ఆ సెగ్మెంట్ లోని చౌల్దరి మండలం నామునగర్ లో ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మూడోసారి మోదీని ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రజలను లక్ష్మణ్ కోరారు.