తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. ఫిబ్రవరి 29వ తేదీ గురువారం నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, ఆయన కొడుకు జడ్పీటీసీ భరత్ లు.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన, రాములుకు పార్టీ కండువా కప్పి.. ప్రాథమిక సభ్యత్వాన్ని అందించారు. ఈకార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకె అరుణ, ఎంపి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :- జయప్రద అరెస్ట్ ఖాయమా.. రేపో మాపో జైలుకు వెళతారా..!

అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎంపీ రాములు బీజేపీలో చేరడాన్ని  ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయనమన్నారు. ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతారని అన్నారు.  గత పదేళ్లలో తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలు గెలచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని.. ఇక,  కాంగ్రెస్-బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని లక్ష్మణ్ తెలిపారు.