
హైదరాబాద్, వెలుగు: అయోధ్య, కాశీకి తెలుగు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో వారి సౌకర్యార్థం వసతి, పార్కింగ్ వంటి నిర్మాణాలకు భూమి కేటాయించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసి వినతిపత్రం అందించారు. భక్తులకు తక్కువ ధరలకు సురక్షితమైన వసతి, భోజనం, పార్కింగ్ వంటివి అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కనీసం 2వేల చదరపు గజాల నుంచి 1 ఎకరం వరకు భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. భూమిని కేటాయించిన తర్వాత, అవసరమైన వసతుల నిర్మాణాన్ని తన ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా లేదా ఇతర సంబంధిత నిధుల సహాయంతో చేపడతానని యోగికి లక్ష్మణ్ వివరించారు. అయితే, ఈ అంశంపై సీఎం యోగి సానుకూలంగా స్పందించినట్టు లక్ష్మణ్ తెలిపారు.