
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ తోక పార్టీగా వ్యవహరి స్తోందని, ఈ రెండు పార్టీలు వేర్వేరు కాద ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సోమ వారం రాజ్యసభ వాయిదా పడిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. రాజ్య సభలో 176 కింద మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చెప్పారని, చైర్మన్ సైతం సోమ వారం మధ్యాహ్నం 2 గంటలకు సమయం కేటాయించారన్నారు.
కానీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్షాలు చర్చ నుంచి పారిపోయాయన్నారు. మణిపూర్ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కానీ, రూల్ 267 కింద ప్రధాని సమాధానం చెప్పాలనడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రధాని మణిపూర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు.