బీఆర్​ఎస్​ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలి : నామ నాగేశ్వరరావు

బీఆర్​ఎస్​ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలి :  నామ నాగేశ్వరరావు

 ములకలపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం ములకలపల్లి లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గడపకూ బీఆర్ఎస్ మేనిఫెస్టో లోని అంశాలను చేర్చాలని కార్యకర్తలకు సూచించారు. ఎక్కడా లేని సంక్షేమ ఫలాలు తెలంగాణలోనే అందుతున్నాయని తెలిపారు.

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి జోష్ నింపారు. బూత్ కమిటీలు రూట్ కమిటీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు అప్పారావు, ఎంపీపీ నాగమణి, రైతు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ రావు జోగేశ్వరరావు, దమ్మపేట మండల జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, దొడ్డకుల రాజేశ్వరరావు, భారత్ లావణ్య, సర్పంచులు, ఎంపీటీసీలు ముఖ్య కార్యకర్తలు 
పాల్గొన్నారు.  

శాలువ కప్పి సన్మానించిన రైతులు

తల్లాడ, వెలుగు : దశాబ్దకాలంగా సొంత భూమి పై హక్కులు లేక, అధికారులు పత్రాలు ఇవ్వక ఇబ్బంది పడుతున్న భూ సమస్యలకు ఎంపీ నామ నాగేశ్వరావు చొరవతో పరిష్కారం లభించిందని ఏన్కూర్ కు చెందిన రైతులు శుక్రవారం ఎంపీని శాలువాతో సన్మానించారు. ఏన్కూరు మండలం రైతులకు తల్లాడ, ఏన్కూరు సరిహద్దుల్లో సాగు చేస్తున్న భూములకు అధికారులు సాంకేతిక కారణాలు చూపి పాస్‌‌‌‌బుక్ లు ఇవ్వలేదు. పక్క పక్కనే ఉన్న తల్లాడ, ఏన్కూరు రెవెన్యూ అధికారులు ఎవరికి వారు తమ పరిధిలో ఈ భూములు లేవంటూ  చేతులెత్తేశారు.

రికార్డ్ లో కూడా నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, రైతుల ద్వారా సమస్యలు తెలుసుకున్న ఎంపీ నామ నాగేశ్వరరావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చూశారు. అందుకు రైతులు శుక్రవారం ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, వైరా అసెంబ్లీ బీఆర్​ఎస్​ అభ్యర్థి మదన్ లాల్, రైతు బంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు, పార్టీ మండల అధ్యక్షుడు సురేశ్, ఏన్కూరు టౌన్ అధ్యక్షుడు సైదులు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి మోహన్ రావు, వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.