బీసీ బిల్లు పెట్టేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదు

బీసీ బిల్లు పెట్టేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదు

న్యూఢిల్లీ : పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని రాజ్య సభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోకపోతే తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారంలో వాటా కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లవుతుందన్నారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాలు మహా ధర్నా నిర్వహించాయి. 

ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒరిస్సా నుంచి బీసీలు పాల్గొన్నారు. వాళ్లంతా కలసి బీసీ బిల్లు పెట్టాలని, కులాలవారీగా జనాభా లెక్కించాలనే డిమాండ్లతో పార్లమెంటు ముట్డడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడారు. కుక్కలకు, నక్కలకు లెక్కలున్నాయి గానీ, బీసీలకు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పదవుల్లో బీసీల ప్రాతినిథ్యం 14% దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన లెక్కల ద్వారా తేలిందని గుర్తుచేశారు.