
- అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
- ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్
ట్యాంక్‌బండ్, వెలుగు: గ్రూప్ 1 పై హైకో ర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైకోర్టు అనేక అంశాలను లోతుగా పరిశీలించి తప్పులను వెలికి తీసి.. అవకతవకలు జరిగినట్టు గుర్తించిందని పేర్కొన్నారు.
కోర్టు తీర్పులోని అంశాలను లోతుగా పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని న్యాయ విచారణ ద్వారా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సెక్రటేరియెట్ వద్ద నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్‌తో కలిసి కృష్ణయ్య మాట్లాడారు. తెలుగులో రాసిన జవాబు పత్రాలను సరైన విధానంలో దిద్దలేదని, మెయిన్స్ మూల్యాంకన ప్రక్రియలో టీజీపీఎస్సీ ప్రతి సూత్రాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు.