జైల్లో ఖైదీలకు రూ.2,100.. స్టూడెంట్లకు రూ.950 :ఆర్ కృష్ణయ్య

జైల్లో ఖైదీలకు రూ.2,100.. స్టూడెంట్లకు రూ.950 :ఆర్ కృష్ణయ్య

మెహిదీపట్నం, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో మెస్​ చార్జీలు పెంచాలని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్​ చేశారు.  స్కాలర్​షిప్​లు, మెస్​ చార్జీలు పెంచాలని డిమాండ్​ చేస్తూ  బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్టూడెంట్లు మాసబ్ ట్యాంక్ లోని తెలుగు సంక్షేమ భవన్​ను మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. సీఎం, మంత్రులు, ఆయా శాఖల కమిషనర్లు హాస్టళ్లను సందర్శించి స్టూడెంట్ల కష్టాలను తెలుసుకోవాలన్నారు. హోటల్​లో పూట భోజనం రూ.60 వరకు ఉందని,  స్టూడెంట్లకు రూ.10  ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలకు నెలకు రూ.2,100 ఇస్తూ, స్టూడెంట్లకు రూ.950 ఇవ్వడం అన్యాయమన్నారు.