
- ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూళ్లలోని తెలంగాణ విద్యార్థులను తొలగించొద్దని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఏపీ సైనిక్ స్కూళ్లలో 67 శాతం లోకల్ కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించడంతో వేలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. సోమవారం ఈ విషయమై కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ తో రఘునందన్ రావు ఫోన్ లో మాట్లాడారు.
తెలంగాణలో సైనిక్ స్కూల్స్ ప్రారంభమయ్యే వరకు ఆ రాష్ట్ర విద్యార్థులకు ఆంధ్రాలో లోకల్ కోటా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ను కలవబోతున్నట్టు రఘునందన్ రావు పేర్కొన్నారు. అప్పటివరకు తల్లిదండ్రులు సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.