యూరియా కృత్రిమ కొరతతోనే రైతులకు కష్టాలు : ఎంపీ రఘునందన్ రావు

యూరియా కృత్రిమ కొరతతోనే రైతులకు కష్టాలు : ఎంపీ రఘునందన్ రావు

 

  • బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మాటలను, మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దు
  • ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్

సిద్దిపేట రూరల్/ దుబ్బాక వెలుగు: యూరియా కృత్రిమ కొరతతోనే రైతులు కష్టాలు పడుతున్నారని, అందుకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్​, కాంగ్రెస్​ నేతలు చెప్పే మాయ మాటలు, మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని రైతులకు సూచించారు.

 శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరియాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.  ఆ పార్టీల నేతల తప్పుడు ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.  ఆపరేషన్​ సింధూర్​తో చైనా నుంచి రావాల్సిన 50 వేల మెట్రిక్​ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనది వాస్తవమని చెప్పారు.

  రెండు మూడు రోజుల్లో యూరియా  సరఫరా అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును మాజీ సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు అందిస్తే, నేడు కాంగ్రెస్ బిహార్ లో ఆ పార్టీ అధినేత పర్యటనకు రాష్ట్ర హెలికాప్టర్ వినియోగిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని ప్రచారం చేయడం తగదని, అన్ని రాష్ట్రాలను సమ దృష్టితోనే చూస్తూ నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.