ఖేలో ఇండియాలో భాగస్వామ్యులు కావాలి : ఎంపీ రఘునందన్ రావు

ఖేలో ఇండియాలో భాగస్వామ్యులు కావాలి : ఎంపీ రఘునందన్ రావు
  • ఎంపీ రఘునందన్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: దేశ ప్రజలందరూ ఫిట్ గా ఉండాలంటే  ఖేలో ఇండియా లో భాగస్వామ్యులు కావాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శుక్రవారం సిద్దిపేట మినీ స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జనాభాలో ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలోకి వస్తున్న విధంగా క్రీడల్లో కూడా నెంబర్ వన్ స్థానంలోనికి రావాలని ప్రతి పార్లమెంట్ సభ్యుడు కృషి చేస్తున్నారన్నారు.

మూడు నెలలపాటు గ్రామీణ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు టోర్నమెంట్స్ ను కండక్ట్ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, టౌన్ ప్రెసిడెంట్ వెంకట్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి

కొండాపూర్: ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నేషనల్​స్పోర్ట్స్​డే సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి హాకీ క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ..విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలని, విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులు, రంగాలు ఎంచుకునే స్వేచ్ఛ కల్పించాలని సూచించారు. పీఎం మోదీ సూచనల మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తోందని వివరించారు.

సెప్టెంబర్ 21 నుంచి టీంల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని, డిసెంబర్ 25 నాటికి జాతీయ స్థాయి క్రీడల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి ఖాసీం భేగ్, ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రటరీ -చంద్రశేఖర్, బాక్సింగ్ అసిస్టెంట్- హనుమంత్ గౌడ్, వాలీబాల్ అసిస్టెంట్ -కృష్ణ పాల్గొన్నారు .