తెల్లాపూర్లో రైల్వే సమస్యలు పరిష్కరించండి : మంత్రి అశ్వినీ వైష్ణవ్

తెల్లాపూర్లో రైల్వే సమస్యలు పరిష్కరించండి : మంత్రి అశ్వినీ వైష్ణవ్

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ను ఎంపీ రఘునందన్ రావు కోరారు. శనివారం కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్​కు విచ్చేసిన మంత్రికి వినతిపత్రం అందజేశారు. కొల్లూర్, వెలిమెల మధ్య రైల్వే ఓవర్​ బ్రిడ్జి చాలా ఏళ్లుగా నిర్మాణ దశలోనే ఉందన్నారు. 

దీంతో  ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎంఐజీ కాలనీ నుంచి తెల్లాపూర్​వంద ఫీట్ల రోడ్డు వద్ద  ఆర్​యూబీ పూర్తయితే చుట్టుపక్కల కాలనీల ప్రజలకు చుట్టూ తిరిగి ప్రయాణించే కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. ఈదులనాగులపల్లిలో రైల్వే టర్మినల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఆయా సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని  పేర్కొన్నారు.   

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

సిద్దిపేట, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శనివారం సిద్దిపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాలకు హాజరై, మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.  మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, నాయకులున్నారు.

రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలి

చిన్నకోడూరులో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను హైదరాబాద్​లో కలిసి వినతిపత్రం అందించారు.