కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ను ఎంపీ రఘునందన్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లో రైల్వే స్టేషన్‌ను పూర్తి చేయడం ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు నిదర్శనమన్నారు.
ప్రధాని మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో రైల్వే మంత్రితో మాట్లాడి వీలైనంత తొందరగా రైల్వే స్టేషన్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శంకర్, మండల అధ్యక్షురాలు స్వరూప, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, కనకయ్య, సీనియర్ నాయకులు భిక్షపతిరెడ్డి, రాములు, శ్రీనివాస్ గౌడ్, కరుణాకర్, రాజుచారి, నాగరాజు, యువమోర్చా మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు బాలమని, బాలచందర్, భరత్ పాల్గొన్నారు.
