ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బర్త్ డే విషెస్

 ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బర్త్ డే విషెస్

ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా పలువురు  రాజకీయ నాయకులు ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెబతున్నారు.  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలుపగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీకు మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను  అని ట్వీట్ చేశారు.

 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీని నవ భారత రూపశిల్పి అని అభివర్ణించారు. ప్రధాని మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా  సామాన్యులు కూడా నేరుగా ప్రధానికి శుభాకాంక్షలు చెప్పవచ్చు. 'ది నమో యాప్' ద్వారా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు పంపవచ్చు. 

ALSO READ:   కరెంట్​ సమస్య తీరిస్తేనే బిల్లులు కడతాం 

సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా పీఎం విశ్వకర్మ యోజనను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 2023-24 సాధారణ బడ్జెట్‌లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు రూ.13000 కోట్లు కేటాయించింది.