కరెంట్​ సమస్య తీరిస్తేనే బిల్లులు కడతాం

కరెంట్​ సమస్య తీరిస్తేనే బిల్లులు కడతాం

అచ్చంపేట, వెలుగు: గ్రామంలో కరెంట్​ సమస్యను పరిష్కరిస్తేనే బిల్లులు కడతామని బల్మూర్  మండలం గోదల్  గ్రామస్తులు విద్యుత్​ ఉద్యోగులను అడ్డుకున్నారు. మండలం లోని కొండారెడ్డిపల్లి సబ్ స్టేషన్​కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదల్  గ్రామంలో ఇష్టం వచ్చినట్లు కరెంట్​ కట్ చేస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదల్, మానాజీపేట, వల్లభాపూర్, రాంపూర్, బాకారం, మాడాపురం వరకు ఒకే ఫీడర్  కింద లైన్ ఉండడంతో ఎక్కడ సమస్య వచ్చినా అన్ని గ్రామాలకు కరెంట్​ కట్ చేస్తున్నారని ఆవేదన  వ్యక్తం చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్​ పోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. 

ALSO READ: దళితబంధు కమీషన్లపై ఎంక్వైరీ చేయాలి: పటేల్ ప్రభాకర్ రెడ్డి 

బిల్లులు వసూలు చేసేందుకు వచ్చిన సిబ్బందిని అడ్డుకున్న గ్రామస్తులు ఈ విషయాన్ని డీఈ, ఏడీఈ, ఏఈలకు ఫోన్​లో తెలియజేశారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని ఏడీఈ చెప్పినా, సమస్య పరిష్కరించాకే బిల్లులు కడతామని గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీంతో విద్యుత్  సిబ్బంది బిల్లులు వసూలు చేయకుండానే వెళ్లిపోయా రు. జహంగీర్, వెంకట్ రెడ్డి, జంగయ్య, అల్వాల్ రెడ్డి, నారాయణరెడ్డి, ఖాజా మియా, లింగారెడ్డి, కోటయ్య, శేఖర్, యాదగిరి, ఆంజనేయులు, లక్ష్మణాచారి, రామాచారి, ఖాసీం, ప్రభాకర్  పాల్గొన్నారు.