గోల్డెన్ టెంపుల్లో రాహుల్ గాంధీ పూజలు

గోల్డెన్ టెంపుల్లో రాహుల్ గాంధీ పూజలు

అమృత్‌సర్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పంజాబ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన అమృత్‌సర్‌ లోని గోల్డన్  టెంపుల్ ను దర్శించుకున్నారు. కాషాయ రంగు తలపాగా ధరించిన రాహుల్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహుల్ మూడెంచల భద్రత ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది ఎవరూ కూడా టెంపుల్ లోపలికి రాలేదు. రాహుల్ కూడా టెంపుల్ లోపల కూడా  సామాన్య వ్యక్తిలానే ఉన్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి గోల్డన్  టెంపుల్లోకి రావడం ఇదే తొలిసారి. 

పంజాబ్ లో రాహుల్‌ 10 రోజులపాటు 350 కిలోమీటర్లు నడవనున్నారు.  సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగియనుంది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లను కవర్ లను కవర్  చేసి పంజాబ్ లో చేరింది.