ఐటీఐఆర్ రద్దు చేయడం సిగ్గుచేటు

ఐటీఐఆర్ రద్దు చేయడం సిగ్గుచేటు

ఐటీఐఆర్ రద్దు అనేది రాజకీయ కక్ష సాధింపే అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆరోపించారు. 2008లో నిర్ణయించిన ప్రాజెక్ట్ ఇది.. ఐటీఐఆర్ రద్దు చేయడం నిజంగా సిగ్గుచేటన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగితే అన్ని రంగాలు వృద్ధి చెందుతాయి. రూ. 160 కోట్లు మంజూరు చేసిన ప్రాజెక్ట్ ను అర్ధాంతరంగా రద్దు చేశారు. ఇదేదీ లేకపోయినా తెలంగాణలో ఐటీ ఎంతో వృద్ధి చెందింది అన్నారు. టీ-హబ్ వరల్డ్ క్లాస్ గా ఏర్పాటు చేశాం. బెంగళూరును దాటిపోతుంది అని భయపడుతున్నారో ఏమో అర్ధం కావడం లేదు అని తెలిపారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్ లు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు. దీనికి ధీటుగా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 

22 సాఫ్ట్ వేర్ పార్కులు దేశంలో మంజూరు చేస్తే, ఒక్కటి కూడా హైదరాబాద్ కి ఇవ్వలేదని రంజిత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు FRBM పరిధిలోనే ఉన్నాయి. అయినా రాజకీయం చేస్తున్నారు ఫైర్ అయ్యారు. అనేక రాష్ట్రాల్లో GSDP కంటే ఎక్కువ అప్పులు చేశాయన్నారు. బడ్జెట్ మించి అప్పుల విషయంలోనూ రాద్ధాంతం చేస్తున్నారు. కేంద్రమే 89% మేర అప్పు చేసింది. నిజానికి 40% వరకే ఉండాలి. FCI కి రూ. 2 లక్షల కోట్ల మేర అప్పు ఉంది. 40 కోట్ల పైచిలుకు ధాన్యం బస్తాలు ఉండాల్సిన చోట 2 లక్షల బస్తాలు తక్కువ ఉన్నాయని అంటున్నారు. లెక్కల్లో తేడా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వ సమస్య. మీకేం సంబంధం? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగ్ నివేదిక ప్రకారం కేంద్రం అనేక ఖర్చులకు లెక్కలు చూపడం లేదు. రెవెన్యూ డెఫిసిట్ లో వీటిని చూపడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు బీజేపీని నిలదీయాలి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు అని ఎంపీ రంజిత్ రెడ్డి సూచించారు