శారీరక దారుఢ్యంతో ఉన్నత విజయాలు

శారీరక దారుఢ్యంతో ఉన్నత విజయాలు
  • పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 
  • జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరు

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: శారీరక దారుఢ్యంతో ఉన్నత విజయాలు సాధించవచ్చని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.  ఆదివారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్ పరిధి మైత్రి గ్రౌండ్స్ లో జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ చాంపియన్​షిప్​ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 250 మంది బాడీ బిల్డర్స్ ప్రదర్శనలు ఇచ్చారు.  అత్యుత్తమ ప్రతిభ చూపిన బాడీ బిల్డర్లకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు.

వచ్చే నెలలో జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. పటాన్​చెరు లో తొలిసారిగా జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.  డీఎస్పీ ప్రభాకర్, గూడెం మధుసూదన్ రెడ్డి, సీఐ వినాయక్​రెడ్డి, ట్రాఫిక్​ సీఐ లాలునాయక్​, నిర్వాహకులు పాల్గొన్నారు.