వరద సాయంలో దోపిడీ.. కేంద్రంతో విచారణ జరిపించాలి

వరద సాయంలో దోపిడీ.. కేంద్రంతో విచారణ జరిపించాలి

హైదరాబాద్ : వరద సాయాన్ని TRS నేతలు పంది కొక్కుల్లా  తింటున్నారన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. లభ్దిదారుల ఖాతాల్లో వరద సహాయాన్ని జమ చేయాలి కానీ.. చేయడం లేదన్నారు. మోడీ కూడా జాన్ ధన్ ఖాతాలు తెరిపించారని..ఈ ఖాతాల్లోనే కరోనా టైంలో 1500 జమ చేశారన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లో ఎందుకు జమ చేయడం లేదన్నారు. వరద సహాయాన్ని డైరెక్ట్ గా డబ్బులను ఎందుకు పంచుతున్నారన్న రేవంత్..GHMC ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే డైరెక్ట్ గా TRS నేతలు డబ్బులు పంచుతున్నారన్నారు. నిజమైన లబ్ధిదారులకు వరద సాయం అందడం లేదని..వరద సాయం పేరుతో టీఆర్ఎస్ సర్కార్ GHMC ఎన్నికల కోసం రూ. 250 కోట్లను పంచగా.. మరో రూ. 250 కోట్లు TRS నేతలు తిన్నారన్నారు. మొత్తం రూ. 500 కోట్ల దోపిడి జరిగిందన్నారు.

దీనిపై బండి సంజయ్, కిషన్ రెడ్డిలు విచారణ చేయాలంటున్నారు కానీ..ఎవరిని కోరుతున్నారు? ఎవలు చేయాలి విచారణ? కేంద్రంలో వాళ్ళ బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా విచారణ జరిపించ వచ్చు కదా…? డిజాస్టర్ మేనేజ్ మెంట్ కు మంత్రిగా ఉంది కిషన్ రెడ్డే కదా.. కిషన్ రెడ్డి, TRSకు మద్య ఒప్పందాలు ఉన్నాయన్నారు. కిషన్ రెడ్డి, కేటిఆర్ లు చీకట్లో  మాట్లాడుకుంటారని.. తెల్లారిన తర్వాత కొట్లాడుకుంటారన్నారు. 2018 ఎన్నికల నగారా మోగిన తరువాత బీజేపీ నేతలు కిషన్ రెడ్డి ,లక్ష్మణ్, చింతల రామచంద్రా రెడ్డి. రాజాసింగ్ లు కేసీఆర్ ప్రగతి భవన్ లో కలిశారన్నారు. ఎందుకు కలిశారు అని మీడియా అడిగితే.. వాజపేయి విగ్రహాన్ని పెట్టాలని కేసీఆర్ ను కలిశామన్నారు బీజేపీ నేతలు. వాజపేయి విగ్రహంను ఇప్పటి వరకూ ఎందుకు నిర్మించలేదన్నారు