మా వార్తల్ని ఎందుకు ప్రసారం చేయడం లేదు : యాడ్స్ రాకుండా చేస్తాం

మా వార్తల్ని ఎందుకు ప్రసారం చేయడం లేదు : యాడ్స్ రాకుండా చేస్తాం

మీడియాపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్నాం . ప్రజలకోసం ఎన్నో చేస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీకి గురించి ఓ వర్గానికి చెందిన మీడియా వార్తల్ని ప్రసారం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న తమ వార్తల్ని ప్రసారం చేయకపోవడాన్ని సీరియస్ గా తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపుతూ ఆయా తీర్మానాల్ని మీడియా యాజమాన్యాలకు పంపిస్తామన్న రేవంత్ రెడ్డి..ఆ తరువాత నుంచి నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆ కార్యక్రమాలను  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామన్నారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ కు 46శాతం ఓట్లు వస్తే ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ కు 30శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రజలు 30శాతం ఓట్లతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించారని అన్నారు.

30 నిమిషాల బులిటెన్ లో వార్తలు, యాడ్స్ కంప్లీట్ చేసుకోగా..ప్రతిపక్ష పార్టీ కి 6 నిమిషాలు కేటాయించాలి. కానీ ఆ ఆరు నిమిషాల్లో ఓ వర్గానికి చెందిన మీడియా ఛానళ్లు ప్రతిపక్ష పార్టీ గురించి ఒక్క వార్త కూడా ప్రసారం చేయకపోవడం దారుణమన్నారు.

రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రసారం చేయాలని, లేదంటే ఛానల్స్ కు వచ్చే  ప్రైవేట్ యాడ్స్ ను అడ్డుకుంటాం. అవసరం అయితే కేబుల్ వైర్లను కట్ చేస్తామంటూ ఎంపీ రేవంత్ రెడ్డి  మీడియాను హెచ్చరించారు.