ఎమ్మెల్సీ గోరేటీ వెంకన్నకు నా శుభాకాంక్షలు

V6 Velugu Posted on Nov 16, 2020

ఎమ్మెల్సీ గోరేటీ వెంకన్నకు  శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ రేవంత్ రెడ్డి. గోరేటీ వెంకన్న గతంలో ప్రజల సమస్యలపై పాటల రూపంలో ఎలా తెలియజేసారో..భవిష్యత్ లో కూడా చట్టసభలల్లో ప్రజా సమస్యలపై గొంతెంతాలని కోరుతున్నానన్నారు. మిగతా వారిలాగ దొరగడిలో బందీ కావోద్దన్నారు.  తెలంగాణలో బీజేపీ ఎప్పటికి బలపడలేదన్న రేవంత్..స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ..బీజేపీకి అభ్యర్థులే దొరకలేదన్నారు. రఘనందన్ గెలుపుకు ..కర్ణుడు చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయన్నారు. కిషన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు  శ్రీధర్ రెడ్డిని టిఆర్ఎస్ కు పంపించి..నాకు అత్యంత సన్నిహితుడిని మీ పార్టీ లో చేర్చుకోవడం వెనుక ఉన్న మతలబేంటి..? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి జెంటిల్ మ్యాన్ అని ఎందుకు కేటీఆర్ సర్టిఫికెట్ ఇచ్చిండో..ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు!.

హైదరాబాద్ అభివృద్ధికి 7సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు నిధులు ఇస్తలేదన్న రేవంత్..ప్రతీ సంవత్సరం లేని ఆదాయాన్ని ఉన్నట్లు చూపి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల అప్పులు తెచ్చిందన్నారు.ఇది నిరూపణ అయితే కేసీఆర్ జైలుకు పోతాడన్నారు. అయినా కిషన్ రెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదన్న రేవంత్..సెక్రటేరియట్ లో నల్లపోచమ్మ గుడి కూల్చితే..కనీసం పరిశీలించడానికి కిషన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదన్నారు. కాంగ్రెస్ పనైపోయిందని..బీజేపీ అసత్య ప్రచారంతో అపోహలు సృష్టించిందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి.

Tagged MP Revanth reddy, MLC Elections, greetings, Goreti Venkanna

Latest Videos

Subscribe Now

More News