నా నియోజకవర్గంలో ఆక్సిజ‌న్ ప్లాంట్ త్వరగా నిర్మించాలి

నా నియోజకవర్గంలో ఆక్సిజ‌న్ ప్లాంట్ త్వరగా నిర్మించాలి

మల్కాజ్‌గిరి కోవిడ్ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ప్లాంట్ త్వ‌ర‌గా అందుబాటులోకి వ‌చ్చే విధంగా చూడాల‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డిని మాల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట‌్టర్‌లో విజ్ఞ‌ప్తి చేశారు. బుధవారం కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి  కిష‌న్ రెడ్డి బొల్లారం కోవిడ్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన సంద‌ర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి ఈ విజ్ఞ‌ప్తి చేశారు. ‘రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో.. స్థానిక ఎంపీగా, ప్ర‌జా ప్ర‌తినిధిగా నా వంతు బాధ్య‌తగా ‌కంటొన్మెంట్ బొల్లారం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని కోవిడ్ ఆస్ప‌త్రిగా మార్పు చేసి నియోజ‌క‌వ‌ర్గంలోని ‌క‌రోనా బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని 15 రోజుల క్రిత‌మే నిర్ణ‌యించ‌డం జరిగింది. అందుకు సంబంధించిన ప‌నులు చురుగ్గుగా సాగుతున్నాయి. ఆ ప‌నుల‌ను స్థానిక ఎంపీగా ఉన్న నేనే ప‌‌ర్య‌వేక్షిస్తున్నాను. ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌కు చిక్సిత‌ అందించ‌డంలో కీల‌క‌మైంది ఆక్సిజ‌న్ ప్లాంట్ నిర్మాణం. పిఎమ్ కేఆర్ నిధుల ద్వారా బొల్లారం ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ప్లాంట్ నిర్మించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌కి, డీఆర్‌డీవో చైర్మన్ డా. స‌తీష్ రెడ్డికి లేఖలు కూడా రాయ‌డం జరిగింది. ఆక్సిజ‌న్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన ప‌నులు త్వ‌ర‌గా పూర్తి అయ్యేలా చూడాల‌ని మరోసారి మీకు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.