మొదటిసారి కేసీఆర్‌లో భయం కనిపిస్తుంది

V6 Velugu Posted on Aug 25, 2021

20 ఏళ్ళు TRSదే అధికారం అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లు అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు 20నెలల భయం పట్టుకుందన్నారు. మొదటిసారి కేసీఆర్ లో భయం కనిపిస్తుందని.. అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారన్నారు. మూడు చింతల పల్లి దీక్షలో మీడియాతో చిట్ చాట్ చేశారు రేవంత్ రెడ్డి. TRS కార్యవర్గ సమావేశం తర్వాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రీఫ్ చేయలేదని.. ఆఖరుకు కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారన్నారు. భవిష్యత్ లో TRS సీనియర్ లీడర్లు కేసీఆర్ పక్కన కూర్చోడానికి భయపడతారన్నారు. కేసీఆర్ ఒంటరి వాడు అయ్యారని విమర్శించారు. మూడు చింతల పల్లి గ్రామానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. కేసీఆర్ ఫౌంహౌస్ కోసం రోడ్డును మూడు చింతలపల్లిలో 6ఫీట్లు పెంచి  వేశారన్నారు. అందరికీ దళితబంధు ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అన్నారు. బడ్జెట్ సరిపోకపోతే సెక్రటరియేట్, అసెంబ్లీ అమ్ముదాం.. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు పెడ్తామన్నారు రేవంత్.

Tagged Telangana, COMMENTS, KCR, MP Revanth reddy, Chintamadaka

Latest Videos

Subscribe Now

More News