
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఓ చేతితో బీజేపీని.. మరోచేతితో ఎంఐఎంని నడిపిస్తున్నారన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు రేవంత్. ‘టిఆర్ఎస్ కి బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటుంది. బీజేపీ ఈ వాదన తేవడం వాళ్ళ ఇష్టం. మొన్న జరిగిన ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్ కు సంపూర్ణ సహకారం అందించారు. బీజేపీకి కేసీఆర్ మద్దతు ఇవ్వకుండా చూసే బాధ్యత నాది అని అసదుద్దీన్ మాటిచ్చారు. బీజేపీకి తెలంగాణ ప్రాజెక్ట్ లు పట్టడం లేదని టిఆర్ఎస్ చెప్పింది.
రాజ్యసభలో RTI బిల్లు సవరణకు మొదట వ్యతిరేకించినా… అమిత్ షా ఫోన్ తో.. కేసీఆర్ మద్దతు పలికారు. రాజ్యసభ ముఖం చూడని… సంతోష్ హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లి RTI బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఢిల్లీలో… కేంద్ర మంత్రి జవదేకర్ తో ఎంపీ సంతోష్ కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు సంఘటనలతో బీజేపీ.. టిఆర్ఎస్ మైత్రి ఎంత బలపడిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. అసదుద్దీన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
కేసీఆర్.. బీజేపీతో కలిసి పనిచేస్తున్న దానికి ప్రజలకు అసద్ వివరణ ఇవ్వాలి. సొంత ఎమ్మెల్యేలు.. మంత్రులకు సమయం ఇవ్వని కేసీఆర్ అమిత్ షా కి హాట్ లైన్ లోకి ఎలా వచ్చారు. సమాచార హక్కు సవరణ బిల్లుతో.. తెలంగాణకి ఎలాంటి మేలు జరగనప్పుడు కేసీఆర్ ఎందుకు మద్దతు ఇచ్చారు. బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పాలి. కేసీఆర్ కి ప్రత్యామ్నాయం అని చెప్పే బీజేపీ.. కేసీఆర్ మద్దతు ఎందుకు తీసుకున్నారు. కేసీఆర్ అక్రమాలపై పోరాటం చేయడానికి బీజేపీలో చేరుతున్న అని చెప్పిన డీకే అరుణ.. జితేందర్ రెడ్డిలు ఏం సమాధానం చెప్తారు.
కేసీఆర్… అమిత షా ఒక్కటే. బీజేపీ, టిఆర్ఎస్ లు ఇద్దరు మిత్రులే. కేసీఆర్ ని వ్యతిరేకించేది బీజేపీ అని చెప్పే వాళ్లంతా ఇప్పుడు సమాధానం చెప్పాలి. సహారా కేసు ఎంత వరకు వచ్చిందో… కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ESI ఆసుపత్రి అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో… సీబీఐ విచారణ ఎంత వరకు వచ్చిందో కూడా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.