శివసేనలోకి ఊర్మిళ మటోండ్కర్.. వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం!

శివసేనలోకి ఊర్మిళ మటోండ్కర్.. వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం!

రంగీలా హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ మంగళవారం శివసేన పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి లోకసభకు పోటీచేసి ఊర్మిళ ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. శివసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను ఎన్నుకోవడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా శివసేన ప్రభుత్వం ఊర్మిళతో పాటు మరో 11 మంది పేర్లను ఇప్పటికే గవర్నర్ బీఎస్ కోశ్యారీకి పంపినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఊర్మిళ ఎమ్మెల్సీగా శాసనమండలిలోకి అడుగుపెట్టనున్నారు.

కాగా.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ ముంబైని పాక్‌తో పోల్చడంతో తీవ్ర దుమారం రేగింది. శివసేన ప్రభుత్వానికి, కంగనా రనౌత్‌కి మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఊర్మిళను పార్టీలో జాయిన్ చేసుకొని.. కంగనాకు పోటీగా ఊర్మిళను రంగంలోకి దించాలని శివసేన యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

For More News..

వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్‌పై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

కరోనా బారినపడి బీజేపీ ఎమ్మెల్యే మృతి

నీ డీజీపీ ఆఫీసుకొస్తా బిడ్డా.. గెలిచే దమ్ములేక దాడి చేస్తున్నరు