30 ఏళ్ల క్రితం కొండగట్టుకు కేసీఆర్... ఫోటోలు వైరల్

30 ఏళ్ల క్రితం కొండగట్టుకు కేసీఆర్... ఫోటోలు వైరల్

సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటించిన నేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్  తన చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం కేసీఆర్తో కొండగట్టుకు వెళ్లిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు కొండగట్టు వంతు వచ్చింది. కొండగట్టు అంజన్నను సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి అనేక సార్లు దర్శించుకున్నారని..అని క్యాప్షన్ ఇచ్చారు.  ప్రస్తుతం కేసీఆర్ కొండగట్టు పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 


ఫోటోల్లో ఎవరెవరు ఉన్నారంటే..?

ఎంపీ సంతోష్ కుమార్ షేర్ చేసిన రెండు ఫోటోల్లో సీఎం కేసీఆర్తో పాటు..ఆయన  సతీమణి శోభారాణి, కుమార్తె కవిత, ఎంపీ సంతోష్ కుమార్  చిన్న పిల్లలుగా ఆడుకుంటున్నారు.  ఈ ఫోటోల్లో ఎంపీ సంతోష్ కుమార్ తల్లిదండ్రులు రవీందర్‌రావు, శశికళ కూడా ఉన్నారు. కేసీఆర్‌ దాదాపు 30 క్రితం కొండగట్టుకు కుటుంబంతో కలిసి వచ్చారు. చివరిసారిగా ఆయన 1998లో కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఉద్యమ సమయంల, ఎన్నికల సమయాల్లో పలుమార్లు జగిత్యాలకు వచ్చినా.. కొండగట్టు ఆలయానికి రావడం మాత్రం ఇదే తొలిసారి. 

రూ. 500 కోట్లు కేటాయింపు

2022  డిసెంబర్ 7న జగిత్యాల జిల్లా మోతెలో నిర్వహించిన బహిరంగ సభలో  సీఎం  కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కొండగట్టు, ధర్మపురి, వేములవాడ రాజన్న ఆలయాల అభివృద్ధిపై ప్రకటనలు చేశారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించారు. తాజాగా కొండగట్టులో పర్యటించారు. కొండగట్టును ప్రపంచాన్నే ఆకర్షించే అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రంగా తీర్చిదిద్దాలని అధికారులను  ఆదేశించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని సూచించారు. అందుకోసం రూ.1,000 కోట్లు ఖర్చయినా ఫర్వాలేదన్నారు.