ఆదివాసీల సంసృతి సాంప్రదాయాలను కాపాడాలె : సోయం బాపూరావు

ఆదివాసీల సంసృతి సాంప్రదాయాలను కాపాడాలె : సోయం బాపూరావు

జైనూర్, వెలుగు: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. పుష్యమాసంలో నెల రోజుల పాటు చేపట్టిన ఆదిశక్తి జంగుబాయి దీక్షలు ఆదివారం పూర్తయ్యాయి. జైనూరు మండలంలోని జంగాం గ్రామంలో కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో సోయం బాపూరావు, భక్తులు దీక్ష విరమించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత లభిస్తుందని, ఆదివాసీ సమాజం దురలవాట్లకు దూరమై సన్మార్గంలో నడవడానికి ఇది మంచి మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి కుమార్ భగవంత్ రావు, జంగో లింగో ఘాన్ సంస్థాన్ అధ్యక్షుడు అత్రం రఘునాథ్, ప్రధాన కార్యదర్శి గెడం జగ్జీవన్ తోపాటు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు పాల్గొన్నారు.