వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎంపీ

వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎంపీ

బోథ్, వెలుగు: బోథ్ మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను శనివారం ఎంపీ సోయం బాపూరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత క్రీడలను మరింత ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. 

సంసద్ ఖేల్ స్పర్థ ద్వారా గ్రామస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎంపీ తన సొంత డబ్బులు రూ. 50 వేలను చైతన్య యూత్ క్లబ్ కు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, జడ్పీటీసీ సంధ్యారాణి పాల్గొన్నారు. 

బాధిత రైతులకు చెక్కుల పంపిణీ 

ఆదిలాబాద్: వన్యమృగాల దాడిలో తమ పశువులను కోల్పోయిన బాధిత రైతులకు మంజూరైన చెక్కులను శనివారం ఎంపీ సోయం బాపూరావు అటవీశాఖ అధికారులతో కలిసి అందజేశారు. బోథ్ మండలంలోని గుట్ట పక్క తండా గ్రామానికి చెందిన గణేశ్ కు రూ.18 వేలు, చిట్టల్ బోరి గ్రామానికి చెందిన చౌహాన్ సోమనాథ్ కు రూ.15 వేల పరిహారం అందించారు. డిప్యూటీ రేంజ్ అధికారి జి.ప్రమోద్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.